తొలి లోక్‌పాల్‌గా జస్టిస్‌ ఘోష్‌ ప్రమాణం

justice pinaki chandra ghosh
justice pinaki chandra ghosh


న్యూఢిల్లీ: భారత తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘోష్‌ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి, ప్రధాని మోది, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగో§్‌ులు హాజరయ్యారు.
లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని ఇటీవల సుప్రీం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మోది నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఘోష్‌ను లోక్‌పాల్‌ చీఫ్‌గా ఎంపిక చేసింది. లోక్‌పాల్‌లో నాన్‌ జ్యూడిషియల్‌ సభ్యులుగా పారా మిలిటరీ దళమైన సశస్త్ర సీమా బల్‌ మాజీ అధిపతి అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ జైన్‌తో పాటు మహేంద్ర సింగ్‌, ఇందర్‌జీత్‌ ప్రసాద్‌ గౌతమ్‌లు ఉన్నారు. జ్యుడిషియల్‌ సభ్యులుగా జస్టిస్‌ దిలీప్‌ బి ఖోస్లే, జస్టిస్‌ ప్రదీప్‌ కుమార్‌ మహంతి, జస్టిస్‌ అభిలాషా కుమారి, జస్టిస్‌ అజ§్‌ు కుమార్‌ త్రిపాఠిలను జ్యుడిషయల్‌ సభ్యులుగా ఎంపిక చేశారు. వీరి పేర్లను కోవింద్‌కు పంపగా ఆయన ఆమోదం తెలిపారు.
లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం 2013లో ఆమోదం పొందింది. సిట్టింగ్‌ ఎంపీలు, ఎంపీలు, ఎమ్మేల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులపై వచ్చే అవినీతి కేసులపై దర్యాప్తు చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిఃhttps://www.vaartha.com/latest-news/