అత్యధిక క్యాచ్‌లతో జోరూట్‌ ప్రపంచ రికార్డు

16 ఏళ్ల తర్వాత పాంటింగ్‌ రికార్డు బద్దలు

Joe Root
Joe Root

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జోరూట్‌ ఈ ప్రపంచకప్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట 16 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును రూట్‌ గురువారం అధిగమించాడు. వికెట్‌ కీపర్‌ కాకుండా ఫీల్డర్‌ ఒక ప్రపంచకప్‌లో అత్యధిక క్యాచ్‌లు(12) అందుకున్న ఆటగాడిగా రూట్‌ నిలిచాడు. నిన్నటి రెండో నాకౌట్‌లో ఆసీస్‌ ఆటగాడు పాట్‌ కమిన్స్‌ క్యాచ్‌ అందుకుని ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు 2003లో పాంటింగ్‌ 11 క్యాచ్‌లు అందుకున్నాడు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/