జార్ఖండ్‌లో పోటాపోటీ.. ఎన్నికల ఓట్ల లెక్కింపు

బిజెపి, జేఎంఎం పోటాపోటీ

election counting
election counting

రాంచీ: ఝార్ఖండ్ ప్రజలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీని ఇచ్చినట్టు కనిపించడం లేదు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, బిజెపి,జేఎంఎంలు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుండగా, కాంగ్రెస్ కింగ్ మేకర్ గా అవతరించేలా ట్రెండ్స్ వస్తున్నాయి. మొత్తం 81 సీట్లున్న అసెంబ్లీలో 72 స్థానాల్లో రెండు నుంచి మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి కాగా, బిజెపి 24, జేఎంఎం 23, కాంగ్రెస్ 9, ఎస్జేఎస్యూ 6, ఆర్జేడీ 2, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జమ్ షడ్ పూర్ నుంచి పోటీ చేసిన బిజెపి నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి దిశగా సాగుతున్నారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కన్నా 7 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారని తెలుస్తోంది.

తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/