బస్సు లోయలో పడిన ఘటనలో 6గురు మృతి

bus accident
bus accident


గర్హ్వా: ఝార్ఖండ్‌లో గర్హ్వా ప్రాంతంలో మంగళవారం వేకువజామున 2.30 గంటల సమయంలో బస్సు లోయలో పడి ఆరుగురు మృతిచెందారు. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘడ్‌లోని అంబికాపూర్‌ నుంచి గర్హ్వా పట్టణానికి వస్తున్న బస్సు మార్గం మధ్యలో అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో దాదాపు 50 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సమచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/