జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ రాజీనామా?

naresh goyal
naresh goyal, Jet Airways founder


ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఆయన భార్య అనితా గోయల్‌ కూడా బోర్డు నుంచి వైదొలగనున్నట్లు తెలుస్తుంది. సిఈఓ విన§్‌ు దుబే మాత్రం బోర్డులో కొనసాగవచ్చు. దాదాపు 25 ఏళ్ల క్రితం 1993లో గోయల్‌ ఆయన భార్య కలిసి దీనిని ఏర్పాటు చేశారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇప్పుడు రుణాలు, లీజుల డబ్బులు కూడా చెల్లించలేని దయనీయ స్థితిలో కూరుకుపోయింది. ఇప్పటికే 40 విమానాలను పక్కనపెట్టింది.