రుణ సంక్షోభంలో జెట్‌ ఎయిర్‌వేస్‌

కేవలం 9 విమానాలను నడిపే స్థితికి దిగజారింది
సమీక్ష జరపాలని సురేశ్‌ ప్రభు ఆదేశాలు

jet airways
jet airways

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితి ననాటికీ దిగజారిపోతుంది. నిన్న 14 విమానాలతో సేవలందించిన సంస్థ, నేడు కేవలం 9 విమానాలను నడిపే స్థితికి దిగజారింది. వీటిలో రెండు బోయింగ్‌ 737 కాగా, మరో ఏడు ప్రాంతీయ జెట్‌ ఏటిఆర్‌లు ఉన్నాయి. తాజా పరిణామాలపై పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు జెట్‌ సమస్యలపై సమీక్ష జరపాలని విమానయాన కార్యదర్శి ప్రదీప్‌ సింగ్‌ ఖరోలాను ఆదేశించారు. ప్రయాణికుల అసౌకర్యాన్ని తెలసుకుని వారికి సరైన భద్రత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించాం అని సురేశ్‌ ప్రభు ట్వీట్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/