జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫ‌లితాలు విడుద‌ల

jee-advanced-results-2020- released

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఐఐటీల్లోని బీటెక్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఢిల్లీ ఐఐటీ విడుద‌ల చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకుల ఆధారంగా దేశంలోని 23 ఐఐటీల్లోని 13,600 సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రేప‌ట్నుంచి న‌వంబ‌ర్ 13వ తేదీ వ‌ర‌కు ఆరు విడుత‌ల్లో కౌన్సెలింగ్ జ‌ర‌గ‌నుంది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్ర‌వేశాల‌కు ఈ నెల 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఫ‌లితాల కోసం jeeadv.ac.in. వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారిలో 96 శాతం మంది విద్యార్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు. దేశ‌వ్యాప్తంగా 222 ప‌ట్ట‌ణాల్లో 1001 కేంద్రాల్లో ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. సెప్టెంబ‌ర్ 27న జ‌రిగిన ప‌రీక్ష‌ల్లో 1,51,311 మంది విద్యార్థులు పేప‌ర్1ను, 1,50,900 మంది విద్యార్థులు పేప‌ర్‌2 రాశారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/