ఉన్మాది కత్తిపోట్లకు బలైన ఇద్ద‌రు చిన్నారులు, 15 మందికి గాయాలు

japan stabbing attack
japan stabbing attack

టోక్యో: జపాన్‌లో ఓ ఉన్మాది కవాసకి నగరంలో కత్తితో వీరంగం సృష్టించాడు. స్కూల్‌కు వెళ్లే చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారి చనిపోగా మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 13 మంది స్కూల్‌ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తుంది. ఉదయం 7 గంటలసమయంలో ఈ ఘటన జరిగింది. స్కూలుకు వెళ్లేందుకు బస్టాప్‌కు వచ్చిన చిన్నారులు లక్ష్యంగా ఉన్మాది దాడికి దిగారు. విచక్షణారహితంగా కత్తితో పొడవడంతో ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమైంది. చిన్నారులపై కత్తితో దాడి చేసిన అనంతరం ఉన్మాది తనను తాను పొడుచుకుని చనిపోయాడు. విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు. కత్తి పోట్లకు గురైన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/