భారత్ మొత్తం జనతా కర్ఫ్యూ

మోడీ పిలుపునకు అనూహ్య స్పందన

Delhi_Mumbai Curfew effect

New Delhi: కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకుప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు జనం భారీగా స్పందించారు. ఎక్కడికక్కడ ఇళ్లకే పరిమితమయ్యారు.

దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బంద్ వాతావరణమే కనిపిస్తోంది.

రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వీయ నిర్బంధం చేసుకున్నారు.

కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే బ్రేక్ ఉండాల్సిందేనని ప్రధాని నరేంద్ర మోదీ జనాత కర్ఫ్యూకు పిలుపునిచ్చారు.

దీన్ని పెద్ద ఎత్తున్న ప్రచారం చేయడంతోపాటు పకడ్బందీగా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని సూచించారు.

ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం పక్కాగా అమలవుతోంది.

నిత్యావసరాలు అన్నీ కూడా నిన్ననే తీసుకొచ్చి పెట్టుకున్నారు జనం. దీంతో ఈ రోజు స్వీయ నిర్బంధం వీలుపడింది. ఉదయం పూట అక్కడక్కడా పాల కేంద్రాలు తప్ప మిగతా ఎలాంటి దుకాణాలు తెరవలేదు.

ఉగాది పంచాంగం కోసం : https://epaper.vaartha.com/2600920/Sunday-Magazine/22-03-2020#page/1/1