జెషే ఉగ్రవాది సజ్జన్‌ ఖాన్‌ అరెస్ట్‌

Delhi Police arrests Sajjad Khan
Delhi Police arrests Sajjad Khan

న్యూఢిల్లీ: జైషే యీ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది సజ్జన్‌ ఖాన్‌ ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ స్పెషల్‌ బ్రాంచ్‌ సెల్‌ పోలీసులు రెడ్ పోర్టు ప్రాంతంలో సజ్జన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇటివల జరిగిన పుల్వామా దాడిలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ముదసిర్ అహ్మద్ ఖాన్ కు సజ్జన్ ఖాన్అత్యంత సన్నిహితుడిగా పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ కశ్మీర్ లోని ట్రాల్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ సమయంలో ముదసిర్ అహ్మద్ ఖాన్ ను భద్రతాబలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్ఐఏ) మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ముదసిర్ ఖాన్ ను ఢిల్లీలో శాలువాలు అమ్ముతుండగా పోలీసులు గుర్తించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/