ఈ 28న తెలుగు రాష్ట్రాల సియంల భేటి

కీలక అంశాలపై చర్చలు

KCR, jagan
KCR, jagan

హైదరాబాద్‌: ఈ నెల 28న ప్రగతిభవన్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్‌-జగన్‌ సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవీల సమస్యలపై ఇరు రాష్ట్రాల సియంలు దృష్టి సారించారు. విద్యుత్‌, పౌరసరఫరాల శాఖల్లో చిక్కుముడిగా ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఇరువురు సీయంల చర్చ జరగనుంది. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరగనుంది. ఇరిగేషన్‌, విద్యుత్‌, పౌరసరఫరాల శాఖల్లో విభజన సమస్యలతో పాటు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు పరిష్కార మార్గాలు అన్వేషణ చేయనున్నారు.
జూలై 3న గవర్నర్‌ సమక్షంలో తెలంగాణ, ఏపి సిఎస్‌ల మధ్య సమావేశం జరగనుంది. సియంల భేటిలో ప్రస్తావనకు వచ్చిన అంశాలపై సిఎస్‌లు చర్చించనున్నారు. ఇరిగేషన్‌, విద్యుత్‌, పౌరసరఫరాల శాఖల అధికారులతో సోమవారం నాడు తెలంగాణ సిఎస్‌ ఎస్కే జోషి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/