మహిళా రోబో వ్యోమమిత్ర.. అంతరిక్షంలోకి

2022లో గగన్ యాన్ మిషన్ ను చేపట్టనున్న ఇస్రో

Lady Robot-ISRO
Lady Robot-ISRO

బెంగళూరు: 2022లో గగన్ యాన్ మిషన్ ద్వారా ముగ్గరు వ్యోమగాములను ఇస్రో అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ ముగ్గురు వ్యోమగాములను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంపిక చేశారు. వీరికి రష్యాలోని అంతరిక్ష కేంద్రంలో అవసరమైన శిక్షణను ఇవ్వనున్నారు. గగన్ యాన్ కు ఎంపికైన ముగ్గురు వ్యోమగాములు పురుషులే కావడం గమనార్హం. అయితే వీర ముగ్గురి కంటే ఓ ముందుగా ఓ మహిళను ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. ఆమె పేరు ‘వ్యోమమిత్ర’. అయితే, ఇది ఓ మహిళా రోబో (మరమనిషి) కావడం విశేషం. వ్యోమగాములను అంతరిక్షంలోని పంపడం కంటే ముందే… ఈ వ్యోమమిత్రను నింగిలోకి పంపనుంది. గగన్ యాన్ లో భాగంగానే… ఈ ఏడాది చివర్లో ఈ మిషన్ ను ఇస్రో చేపట్టనుంది. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే కాకుండా… వారిని సురక్షితంగా మళ్లీ భూమిపైకి తీసుకొచ్చే ప్రయోగాన్ని ఇస్రో పరీక్షించనుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/