ఇజ్రాయిల్‌ మూన్‌ మిషన్‌ విఫలం

space craft
space craft


జెరూసలెం: ఇజ్రాయిల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూన్‌ మిషన్‌ విఫలమైంది. చంద్రుని ఉపరితలంపై దిగేందుకు ఉద్ధేశించిన బెర్షీట్‌ అంతరిక్ష నౌకలో చివరి దశలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మరికాసేపట్లో దిగుతుందనగా కుప్పకూలింది. గురువారం ల్యాండింగ్‌ సమయంలో రోబోటిక్‌ లాండర్‌లోని ఇంజిన్‌లో సాంకేతిక లోపంతోపాటు కమ్యూనికేషన్‌ వ్యవస్థ కూడా దెబ్బతిందని మిషన్‌ సిబ్బంది తెలిపారు.
చంద్రని ఉపరితలానికి 15-17 కిలో మీటర్ల దూరంలో ఉండగా కుప్పకూలి ఆ దేశానికి నిరాశను మిగిల్చింది. ఇజ్రాయిల్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా బెర్షీట్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఈ ప్రయోగానికి దాదాపు వంద కోట్లు ఖర్చు చేశారు. ప్రైవేట్‌ స్పేస్‌ అంకుర సంస్థ స్పేస్‌ఐఎల్‌, ఇజ్రాయిల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ సంయుక్తంగా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను నిర్మించాయి.
ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రనిపై సురక్షితంగా లాండర్‌ను దించిన నాలుగో దేశంగా ఇజ్రాయిల్‌ ఘనత సాధించి ఉండేది. ఇప్పటివరకు చంద్రునిపై అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సురక్షితంగా లాండర్లను దించగలిగింది.

తాజా తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/telangana-election-news-2019/