అమెరికా దుందుడుకు చర్యలు ఆపాలి

ఇరాన్‌ కమాండర్‌ హెచ్చరిక

Iranian Navy
Iranian Navy

టెహ్రాన్‌: అమెరికా దుందుడుకు చర్యలు మానుకోకపోతే జూన్‌ 20న జరిగిన డ్రోన్‌ను కూల్చిన సంఘటన మళ్లీ పునరావృతం అవుతుందని ఇరాన్‌ కమాండర్‌ హెచ్చరించారు. నావికాదళ కమాండర్‌ అడ్మిరల్‌ హుస్సేన్‌ ఖన్జాదీ మాట్లాడుతూ..నిఘా డ్రోన్‌ను పేల్చివేయడం అందరూ చూశారు. మళ్లీ అలాంటి చర్యే రిపీట్‌ అవుతుందని , ఈ విషయం తమ శత్రువుకు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. మరోపక్క ప్రస్తుత పరిస్థితులపై ఇరాన్‌ అధ్యక్షుడి సలహాదారు హస్మోద్దీన్‌ అస్న మాట్లాడుతూ..ఇరాన్‌పై ఆంక్షలు కొనసాగుతుండగా అమెరికాతో బేషరతు చర్చలు సాధ్యం కావు అని తేల్చిచెప్పారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/