అమెరికా నిఘా డ్రోన్‌ను పేల్చేసిన ఇరాన్‌!

USA drone
USA drone

అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను ఇరాన్ పేల్చేసింది. హార్మోజ్‌గాన్ ప్రావిన్సులోకి ప్ర‌వేశించిన డ్రోన్‌ను ఇరాన్‌కు చెందిన రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ కార్ప్స్ కూల్చేసిన‌ట్లు తెలిపారు. కౌమోబార‌క్ జిల్లాలో ఇరాన్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత డ్రోన్‌ను పేల్చేసిన‌ట్లు ఇరాన్ న్యూ ఏజెన్సీ ప్ర‌క‌టించింది. అయితే డ్రోన్ కూల్చివేత వార్త‌ల‌ను అమెరికా ఖండించింది. యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ ప్ర‌తినిధి కెప్టెన్ బిల్ అర్బ‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇరాన్ గ‌గ‌న‌త‌లంలోకి ఎటువంటి డ్రోన్ ప్ర‌వేశించ‌లేద‌ని ఆయ‌న అమెరికా వార్త సంస్థ‌కు తెలిపారు. గ‌త ఏడాది కాలం నుంచి అమెరికా, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 2015లో న్యూక్లియ‌ర్ డీల్ నుంచి ట్రంప్ త‌ప్పుకోవ‌డంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త పెరిగింది. ఇటీవ‌ల గ‌ల్ప్ ఆఫ్ ఒమ‌న్‌లో ఇంధ‌నంతో వెళ్తున్న నౌక‌ల‌ను ఇరాన్ పేల్చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా ఆ ప్రాంతానికి ప్ర‌త్యేక బల‌గాల‌ను కూడా పంపించింది. ఆ త‌ర్వాతే ఈ డ్రోన్ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.

తాజా ఏపి వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/