భారత్‌ అనేక సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయం

ప్రతీ న్యాయ సాంప్రదాయాలను స్వాగతించాం

chief justice sa bobde
chief justice sa bobde

న్యూఢిల్లీ: ఈరోజు ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ న్యాయ సదస్సులో చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..అనేక సంస్కృతులు,సాంప్రదాయాలకు ఇండియా నిలయంగా మారిందన్నారు. ఆ కోవలోనే భారతీయ న్యాయవ్యవస్థ కూడా రూపాంతరం చెందినట్లు చెప్పారు. మన దేశానికి వచ్చిన ప్రతి నాగరిక సమాజానికి చెందిన న్యాయ సాంప్రదాయాలను స్వాగతించామని సీజే బోబ్డే తెలిపారు. సుప్రీం తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అన్నారు. మన విధులను మనం సక్రమంగా నిర్వర్తిస్తే, అప్పుడు అన్ని హక్కులను అమలు చేయడం సులువు అవుతుందన్న మహాత్మాగాంధీ బోధనలను బోబ్డే గుర్తు చేశారు. సవాళ్లను న్యాయవ్యవస్థ ఎంత సమర్థంగా ఎదుర్కొంటే.. ఆ చట్టాల అమలులో విజయం అంతగా ఉంటుందని సీజే పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/