నిరసనకారులతో ఇంటర్‌లాక్యుటర్స్‌ భేటీ

shaheen bagh protesters

New Delhi: సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)కు వ్యతిరేకంగా షహీన్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న నిరసనకారులతో ఆందోళనా స్థలం మార్పుపై వారితో చర్చలు జరపడానికి
సుప్రీంకోర్టు నియమించిన ఇంటర్‌లాక్యుటర్స్‌ సమావేశమయ్యారు. ఇంటర్‌లాక్యుటర్స్‌లో న్యాయవాదులు సంజయ్‌ హెగ్డే, సాధనా రామచంద్రన్‌ తదితరులున్నారు. నిరసనకారులనుద్దేశించి సంజయ్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలను చదివి వినించారు.

అనంతరం సాధనా రామచంద్రన్‌ ఆ ఆదేశాలను సారాంశాన్ని హిందీలో వివరించారు. ఆందోళన చేసే హక్కు వారికి ఉందని సుప్రీంకోర్టు చెప్పిందని సాధనా రామచంద్రన్‌ అన్నారు. అయితే మనలాగే ఇతరులకు కూడా వారి హక్కులుంటాయని, రోడ్లు ఉపయోగించుకోవడం, దుకాణాలు తెరవడం తదితర హక్కులు వారికి ఉంటాయని సాధన చెప్పారు. మీడియా ఎదుట నిరసనకారులు మాట్లాడటానికి సిద్ధంగాలేకపోవడంతో మీడియాను అక్కడినుంచి వెళ్లిపోవాలని వారు కోరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/