సీమాంతర దివాలా కేసులపై ప్రత్యేక చట్టం!

INSOLVE--
INSOLVE–

సీమాంతర దివాలా కేసులపై ప్రత్యేక చట్టం!

కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్యానెల్‌ సిఫారసులు

న్యూఢిల్లీ: వివిధ దేశాలమధ్య నడిచే కంపెనీల దివాలా పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్‌లోని ఉన్నతస్థాయి ప్యానెల్‌ ఐక్యరాజ్య సమితి ప్రణాళికను అనుసరించాలని కేంద్రానికి సూచిస్తోంది. సీమాంతర దివాలా కేసులను విచారించేందుకు ఈ విధానం అత్యుత్తమంగా ఉంటుందని చెపుతోంది. దివాలా లా కమిటీ (ఐఎల్‌సి) సీమాంతర దివాలా పిటిషన్ల విచారణ కోసం ఒక ముసాయిదాను రూపొందించి సంప్రదింపులకు విడుదలచేసింది. ఈ స్మృతి కింద వివిధ నిబంధనలను అనుసరించి సీమాంతర దివాలా కేసులను సైతం విచారించి పరిష్కరించుకునే అవకాశం ఉంది. కార్పొరేట్‌ వ్యవహారాల కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్‌ అధ్యక్షతన ఈ ప్యానెల్‌ ఇప్పటికే ఐక్యరాజ్య సమితి అమలుచేస్తున్న అంతర్జాతీయ వాణిజ్య న్యాయచట్టాల విధానాలను దివాలాకేసులకు వినియోగించు కోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.

అయితే సమగ్ర నివేదికను రూపొందించి సత్వరమే ప్రభుత్వానికి అందచేసేందుకు నిర్ణయించింది. ఈ నమూనా కేంద్ర ప్రధాన ఆసక్తి(కోమి) ఆధారంగా బహుముఖ నిర్వచ నాలను ఇచ్చింది. కోమి ప్రకారంచూస్తే సీమాంతర దివాలా కేసులు కోమి విధివిధానాలకు అనుగుణంగానే విచారణచేయవచ్చని ప్యానెల్‌ భావిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ఒక్క కేంద్రంలో మాత్రమే సంప్రదింపులు, విచారణకు అవకాశం ఉంటుంది. 1966లో ఏర్పాటు అయిన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ వాణిజ్య న్యాయనిబంధనల విభాగం ఇలాంటి వాణిజ్య వివాదాలనే పరిష్కరిస్తోంది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్యమండలికి అను బంధంగా యునిసిట్రాల్‌ పనిచేస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో ఒకే చట్టం, ఒకేవిధానం అమలుచేయడం వల్ల వివిధ దేశాల మధ్య వాణిజ్య వివాదాలు తగ్గుతాయని భావిస్తోంది. సీమాంతర వాణిజ్య లావాదేవీల్లో సామ రస్య విదానం వల్ల ఎంతో మేలు కలుగుతుందని కేంద్రం సైతం అంగీక రిస్తున్నది. ఏకీకృత విధానంవల్ల ఒకే న్యాయబద్ధమైన విధానం అనుసరి ంచేందుకు వీలవుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీల్లో సైతం ఒకేవిధానం అమలుకావాల్సి ఉంటుంది. గడచిన జూన్‌లోనే కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇందుకు సంబంధించి నిబంధనల ముసాయి దాను విడుదల చేసింది. అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన సీమాంతర దివాలా విచారణ నిబంధనలను రూపొందింస్తున్నట్లు వెల్లడించింది. ఈ న్యాయసూత్రాలు భారత ఆర్ధిక వ్యవస్థకు సైతం ప్రామాణికంగా నిలుస్తాయని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ భావిస్తోంది.