టీమిండియాకు అనుకోని దెబ్బ

శిఖర్‌ ధావన్‌ వేలికి గాయం, మ్యాచ్‌లకు దూరం
మూడు వారాల పాటు విశ్రాంతి

shikhar dhawan
shikhar dhawan

నాటింగ్‌హామ్‌: ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు అనుకోని ఎదురు దెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్‌ వరల్డ్‌కప్‌లో మూడు, నాలుగు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. గాయమైన అతని వేలికి స్కాన్‌ తీయగా ఫ్రాక్చర్‌ అయిందని తేలింది. దీంతో గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు సుమారు మూదు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. రోహిత్‌ శర్మతో పాటు కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/