ఇన్ఫోసిస్‌ సిఇఒకు రూ.10 కోట్ల స్టాక్‌ గ్రాంట్‌!

salil parekh
salil parekh

బెంగళూరు: ఐటి కంపెనీలు పనితీరు ఆధారంగా ప్రతిభను చూపించి కంపెనీని మరింతముందుకు తీసుకెళుతున్న సిఇఒలకు సముచిత గౌరవం ఇస్తున్నాయి. నిన్నటికి నిన్న టిసిఎస్‌ సిఇఒకు 16 కోట్ల వేతనాన్ని ప్రకటించిన టిసిఎస్‌ తాజాగా ఇన్ఫోసిస్‌ కూడా తమ సిఇఒ సలీల్‌పరేఖ్‌కు రూ.10 కోట్ల విలువైన స్టాక్‌ యూనిట్లను మంజూరుచేసింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ఈ సంస్థ ఇటీవలికాలలో 20శాతం వరకూ ఉద్యోగులు కంపెనీనుంచి వైదొలుగుతున్న సమస్యను ఎదుర్కొన్నది. ఇతర కంపెనీలతోపోలిస్తే ఇన్ఫోసిస్‌నుంచే ఎక్కువ మంది వెళ్లిపోవడం గుర్తించింది. దీనిపై కన్నేసిన యాజమాన్యం తాజాగా గురువారం జరిపిన బోర్డుసమావేశంలో ఈక్విటీ షేర్లను సిఇఒకు కేటాయించాలనినిర్ణయించింది. కొత్తగా ప్రవేశపెట్టి స్టాక్‌ప్రోత్సాహక ప్రణాళిక కింద ప్రతిభావంతులను నిలబెట్టుకునేందుకు ఇన్ఫోసిస్‌ ఈ కసరత్తులుచేస్తోంది. చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి పూర్తికాలపు డైరెక్టర్‌ యుబి ప్రవీణ్‌రావుకు సైతం నాలుగు కోట్ల విలువైన స్టాక్స్‌ను కేటాయించింది. మొత్తం 50 మిలియన్ల షేర్లను ఉద్యోగులకు కేటాయించి ఉద్యోగుల నిష్క్రమణానికి చెక్‌పెట్టింది. ఈ కొత్త కార్యాచరణను ఇన్ఫోసిస్‌ స్టాక్‌యాజమాన్య ప్రణాలిక విస్తరణ పథకం 2019 అని పేరుపెట్టింది. అయితే ఇందుకు వాటాదారుల అనుమతిని పొందాల్సి ఉంటుంది. కంపెనీకి ఉద్యోగులే పెద్ద ఆస్తి అని ఈ పథకం ద్వారా కంపెనీకి అత్యుత్తమ సేవలు అందించిన ప్రతిభావంతులను మరింతగా ప్రోత్సహించేందుకు వీలవుతుందని సిఇఒ ఎండి వెల్లడించారు. కంపెనీల్లో ఉద్యోగులనే వాటాదారులుగాను యజమానులరగాను తీర్చిదిద్దే అవకాశం వల్ల ఉద్యోగులు మరింత చిత్తశుద్ధి అంకితభావంతోపనిచేస్తార్నన అంచనాలున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/