ఇండోనేషియా, జపాన్‌లలో భూకంపం

earth quake
earth quake


జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. యందేనా ఐలాండ్‌లోని సోలంకి సముద్ర తీరం వద్ద భూకంపం తీవ్రత 7.5 గా రిక్టర్‌ స్కేలుపై నమోదైంది. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో సంభవించింది.
యాంబన్‌కు దక్షిణాన 321 కిలోమీటర్ల దూరంలో బండా సముద్ర తీరం వద్ద భూమికి 214 కి.మీ. లోపల భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. 30 నిమిషాల కన్నా ఎక్కువే భూమి ప్రకంపించింది. అక్కడ సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని ప్రభుత్వం తెలపడంతో సునామీ పరిధిలోని ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
సోమవారం తెల్లవారుఝామున జపాన్‌లోనూ భూకంపం చోటు చేసుకుంది. 5.5 తీవ్రతతో ఇది సంభవించినట్లు జపాన్‌ శాస్త్రవేత్తలు ఏజెన్సీ తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/