ఇండో-మారిషస్‌ బంధం పటిష్టం

Dr. GIREESH KUMAR SANGHI
మారిషస్‌లో జరిగిన అంతర్జాతీయ వైశ్‌ దివస్‌ కార్యక్రమంలో ఆదేశ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌తో ఫెడరేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గిరీష్‌ కుమార్‌ సంఘీ. చిత్రంలో ఫెడరేషన్‌ నేతలు గోపాల్‌ మోర్‌, సంజ§్‌ు మోహన్‌ తదితరులు

ఇండో-మారిషస్‌ బంధం పటిష్టం

ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌
మారిషస్‌కు 10 డయాలసిస్‌ యంత్రాలు అందివ్వడానికి డాక్టర్‌ గిరీష్‌ కుమార్‌ సంఘీ హామీ

ూరిషస్‌ µ: భారత సంతతికి చెందిన మారిషి యన్లకు ఓవర్సీస్‌ సిటిజన్‌షిప్‌ ఆఫ్‌ ఇండియా (ఓసిఐ) హోదా ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి తాను ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మారిషస్‌ ప్రధాన మంత్రి ప్రవింద్‌కుమార్‌ జగన్నాధ్‌ పేర్కొన్నారు. మారిషస్‌లో జరిగిన అంతర్జాతీయ వైశ్‌ దివస్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సమావేశంలో అఖిల భారత వైశ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ గిరీష్‌ కుమార్‌ సంఘీ, ఎఐవైఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి గోపాల్‌ మోర్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా విశేషం ఏమిటంటే, ఆ దేశ ప్రధాని కాకుండా 8 మంది కేబినెట్‌ మంత్రులు వైశ్‌ సమాజానికి చెందిన వారు ఉన్నారు. వారంతా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం మారిషస్‌లోని రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ ఆడిటోరియంలో జరి గింది. ఆ దేశ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్‌తో పాటు ఆయన కేబినెట్‌ మంత్రులు, పిఎం సలహాదారులు పాల్గొన్నారు. యునైటెడ్‌ వైశ్‌ ఫ్రంట్‌ కార్వనిర్వాహకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారిషస్‌ ప్రధాన మంత్రి ప్రవింద్‌కుమార మాట్లాడుతూ భారత, మారి షస్‌ దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘకాలం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

మారిషస్‌ మినీ ఇండియా, తమ దేశంలో హిందువులే మెజారిటీగా ఉంటారన్నారు. తమ మారిషస్‌ దేశం డయాబెటిస్‌ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుందని, హిందువులలో ఈ సమస్య అధికంగా ఉందని చెప్పారు. అయితే అత్య వసరంగా డయాలిస్‌ యంత్రాలు సమకూ ర్చాల్సిన అవసరం ఉందని చెప్పగా. ఎవరైనా దాతలు ముందుకు రావాలని కోరగా ఈ సభలో ఉన్న అఖిల భారత వైశ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షుడు వెంటనే స్పందిస్తూ 10 డయాలసిస్‌ యంత్రాలను సమకూరుస్తానని హామీ ఇచ్చారు.

ఆ మరుసటి రోజు జరిగిన ఇరుదేశాల వ్యవహారాలలపై చర్చలు జరిగాయి. అనేక సమస్యలపై డాక్టర్‌ గిరిష్‌ కుమార్‌ సంఘీ ఇచ్చిన సూచనలు.సలహాలకు ఆయనకు అందరి నుంచి అభినందనలు లభించాయి. ఈ సభలో యునై టెడ్‌ వైశ్‌ ఫ్రంట్‌ కార్యదర్శి సంజ§్‌ు మహెన్‌లు మాట్లాడారు.