పాకిస్థాన్‌ గగనతలం మీదుగా మొదలైన రాకపోకలు

IndiGo
IndiGo

న్యూఢిల్లీ: ఫిబ్రవరి 27న భారత వాయుసేన యుద్ధవిమానాలు బాలాకోట్‌పై దాడి చేశాక పాకిస్థాన్‌ తన గగనతల మార్గాలను మూసివేసింది. కొన్ని రోజుల తర్వాత విదేశాల విమానాల రాకపోకలకు అనుమతించినా.. భారత విమానాలపై నిషేధం కొనసాగించింది. అయితే దాదాపు మూడున్నర నెలల తర్వాత పాకిస్థాన్ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలు మొదలయ్యాయి. సోమవారం అర్ధరాత్రి ఇండిగో విమానం దుబాయ్ నుంచి పాక్ గగనతలం మీదుగా ఢిల్లీకి చేరుకున్నది. పాక్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (సీఏఏ) డైరెక్టర్ ప్రత్యక్షంగా ఈ ఘట్టాన్ని పర్యవేక్షించారు. ఈ మార్గాన్ని పూర్తిగా అందుబాటులోకి తెచ్చేముందు టెస్ట్‌ైఫ్లెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఒక విమానాన్ని నడుపాలని భారత్‌కు సూచించింది. ఈ మేరకు ఇండిగో సంస్థకు చెందిన దుబాయ్ఢిల్లీ (6ఈ24) విమానాన్ని సోమవారం రాత్రి నడుపాలని నిర్ణయించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/