భారత సినిమాలు పాక్‌లో ఆడనివ్వం

fawad hussain
fawad hussain, pakistan information minister


ఇస్లామాబాద్‌: ఉగ్రదాడిని నిరసిస్తూ పాక్‌ సమాచార శాఖ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ పాక్‌లో భారత సినిమాలను ఆడనివ్వబోమని ట్విట్టర్‌ ద్వారా తెలిపాడు. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానికి దళం చేపట్టిన దాడితో పాక్‌ భయపడిపోయి, ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఇకపై ఏ భారతీయ సినిమా పాక్‌లో విడుదల కాదని, భారత్‌లో నిర్మించిన ప్రకటనలను కూడా ప్రదర్శించొద్దని సూచించామని పేర్కొన్నారు.