పాక్‌ చర్యలన్నీంటీకి బుద్ధి చెబుతాం

హంద్వారాలో ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి..పాకిస్థాన్ కు హెచ్చరికలు చేసిన జనరల్ నరవాణే

MM Naravane

న్యూఢిల్లీ: భారత ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవాణే జమ్మూకశ్మీర్ లోని హంద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్ పై స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓవైపు ప్రపంచమంతా కరోనాతో అల్లాడుతుంటే, పొరుగుదేశంలో ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ వక్ర బుద్దికి ఇదే నిదర్శనం అని విమర్శించారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘనలకు, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే చర్యలకు అన్నింటికీ అంశాల వారీగా జవాబు చెబుతామని హెచ్చరించారు. హంద్వారా ఘటనలో మృతి చెందిన భద్రతా సిబ్బంది పట్ల భారత్ గర్విస్తోందని, పాక్ కుతంత్రాలకు భారత సైన్యం తగిన విధంగా స్పందిస్తుందని జనరల్ నరవాణే పేర్కొన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/