మిగ్‌-27 యుద్ధవిమానానికి ఘనంగా వీడ్కోలు

చివరిసారిగా గగనవిహారం చేసిన మిగ్‌-27 విమానం

MiG 27
MiG 27

జోధ్‌పుర్‌: భారత వాయుసేనలో మూడు దశాబ్దాలకు పైగా చెరగని సేవలందించిన అతి శక్తిమంతమైన మిగ్‌-27 యుద్ధవిమానం . ఈ లోహ విహంగాలకు నేడు ఐఏఎఫ్‌ ఘన వీడ్కోలు పలికింది. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ వైమానిక స్థావరం నుంచి ఏడు మిగ్‌ 27 విమానాలు చివరిసారి గగనవిహారం చేశాయి. తుదిసారిగా నింగికెగిరిన ఈ విమానాలకు ల్యాండింగ్‌ అయిన తర్వాత జల ఫిరంగుల ద్వారా గౌరవ వందనం సమర్పించారు. 1999 నాటి కార్గిల్‌ యుద్ధంలో సత్తా చాటిన ఈ లోహ విహంగాలను భారత వైమానిక దళంలో బహుదుర్‌గా వ్యవహరిస్తారు. ఈ వీడ్కోలుతో ప్రపంచ వ్యాప్తంగా ఈ యుద్ధవిమానాల ప్రస్థానానికి ముగింపు పడింది. ప్రస్తుతం ఏ దేశంలోనూ ఇవి వినియోగంలో లేవు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/