36 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం

లండన్ లోని కెన్నింగ్టన్ ఓవెల్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై భారత్ 36 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేయగా ఆసీస్ యాభై ఓవర్లలో అల్ ఔట్ అయి 316 పరుగులే చేసింది.