సర్ఫరాజ్‌పై షోయబ్‌ మండిపాటు

Shoaib Akhtar
Shoaib Akhtar


ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ దేశ మాజీ క్రికెటర్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. టాస్‌ గెలిచిన తర్వాత బ్యాటింగ్‌ తీసుకోకుండా బౌలింగ్‌ తీసుకుని సర్ఫరాజ్‌ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని వారు మండిపడుతున్నారు. సర్ఫరాజ్‌ మెదడు లేని కెప్టెన్‌ అంటూ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ విమర్శించాడు. తమ బలం బౌలింగ్‌ అని, బ్యాటింగ్‌ కాదు అని, అందుకే పాక్‌ జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంటే బాగుండేదన్నాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో షోయబ్‌ అక్తర్‌ మాట్లాడుతూ..టాస్‌ గెలిచామంటే సగం మ్యాచ్‌ గెలిచినట్లే నని అన్నాడు. కానీ మ్యాచ్‌ గెలవదన్న రీతిలో పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ వ్యవహరించాడని అక్తర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/