ప్రపంచకప్‌లో చరిత్రలో రోహిత్‌ ఘనత!

ఆరు శతకాలు సాధించిన రోహిత్‌

rohit sharma
rohit sharma

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ ఈ ప్రపంచకప్‌లో ఆరు శతకాలు పూర్తి చేసి ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన సచిన్‌తో సమానంగా నిలిచాడు. ఇప్పటికే పూర్తైన లీగ్‌ దశలో మొత్తం ఐదు శతకాలు నమోదు చేసిన ప్రపంచకప్‌ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
రోహిత్‌ కన్నా ముందు వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైడ్‌ వాల్కాట్‌ తొలిసారి ఒక సిరీస్‌లో ఐదు శతకాలు సాధించాడు. 1955లో ఆస్ట్రేలియ, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో ఈ రికార్డు నెలకొల్పాడు. టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో మంగళవారం తలపడనుండగా రోహిత్‌ మరోసారి చెలరేగితే ప్రపంచకప్‌లో మొత్తం ఏడు శతకాలు సాధించిన తొలి క్రికెటర్‌గా సచిన్‌ను మించిపోతాడు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/