రానున్న రోజుల్లో చైనాను దాటనున్న భారత్‌ జనాభా

population
population

న్యూయార్క్‌: వచ్చే ఎనిమిదేళ్లలో భారత్‌ చైనా జనాభాను దాటేసి రికార్డు సృష్టించనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తుంది. 2019 నుంచి 2050 వరకు మధ్య దేశ జనాభా మరో 27.3 కోట్లు పెరిగే అవకాశముందని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది.
ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.7 బిలియన్లు ఉండగా..2050 నాటికి రెండు బిలియన్లు పెరిగి 9.7 బిలియన్లకు చేరనుందని ఐరాస అంచనా వేస్తుంది. ఇక ఈ దశాబ్డం చివరి నాటికి ప్రపంచ జనాభా దాదాపు 11 బిలియన్లకు చేరే అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొంది.
ప్రపంచ జనాభా పెరుగుదలలో సగానిపైగా కేవలం 9 దేశాల్లోనే నమోదవుతుందని ఐరాస అంచనా వేస్తుంది. రానున్న 30 ఏళ్లలో భారత్‌తో పాటు నైజీరియా, పాకిస్థాన్‌, డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో, ఇండోనేషియా, ఈజిప్టు, అమెరికా, టాంజానియా, ఇథియోపియాలలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండనుందని ఐరాస వివేదిక తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/