వరల్డ్‌కప్‌కు కావాల్సిన ఆయుధ సంపత్తి ఉంది

ravi shastri
ravi shastri

న్యూఢిల్లీ: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ గెలిచేందుకు కావాల్సిన ఆయుధ సంపత్తి భారత్‌కు ఉందని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. అక్కడి పరిస్థితులను అనుసరించి జట్టు కూర్పుపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించాడు. మెగా టోర్నీకి ఎంపికైన విజ§్‌ు శంకర్‌ కీలకమైన నాలుగో స్థానంలో ఆడతాడా అన్న ప్రశ్నకు శాస్త్రి పరోక్షంగా జవాబు చెప్పాడు. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకుని ఆడే ఆటగాళ్లు మనకు ఉన్నారని ,నాలుగో స్థానంలో ఆడగల బ్యాట్స్‌మెన్‌ చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం దాని గురించే ఆలోచించడం లేదు. ఇలాంటి అంశాలను ఎప్పుడో పరిశీలించాం. ఇంగ్లాండ్‌ వెళ్లడానికి 15 మంది కావాలి. ఎంపిక చేశారు. వారిలో ఎవరైనా గాయపడితే ఇతరుల గురించి ఆలోచిస్తాం. ఇంగ్లాండ్‌ వెళ్ళేందుకు ఇంకా సమయం ఉంది మరొకరి ఎంపికపై ఇప్పుడే ఆలోచించడం లేదు అని రవిశాస్త్రి అన్నాడు.
ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జట్లను నమ్మడానిక లేదు ఆ టీమ్‌లను ఎప్పుడూ తక్కువ అంచనావేయోద్దు. వెస్టిండీస్‌ జట్టులో గేల్‌, రసెల్‌ ఉన్నారు. వారి సామర్థ్యం గురించి అందరికీ తెలిసిందే నని రవిశాస్త్రి వెల్లడించారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/