అంతర్జాతీయ రక్షణ దళాల క్రీడా పోటీలకు భారత్‌ ఆతిథ్యం

scout master-2019
scout master-2019

జయపుర: భారత్‌లో అంతర్జాతీయ రక్షణ దళాల ‘స్కౌట్‌ మాస్టర్‌-2019’ క్రీడా పోటీలను రాజస్థాన్‌లో జైసల్మేర్‌లో నిర్వహించనుంది. జూలై 24 నుంచి ఆగస్టు 17 వరకు జరగనున్న ఈ పోటీలను భారత రక్షణ దళాలకు చెందిన కోణార్క్‌ కాప్స్‌ నిర్వహిస్తున్నాయి. తొలిసారి ఆతిథ్య భారత్‌ కూడా వీటిలో పాల్గొంటుంది. రష్యా, చైనా, కజకిస్థాన్‌, ఆర్యేనియా, జింబాబ్వే దేశాలకు చెందిన రక్షణ దళాలు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోటీల్లో మానవ రహిత యుద్ధ విమానాలు, పదాతి దళాల యుద్ధ వాహనాల విన్యాసాలు ప్రముఖంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/