ఉత్తర కొరియాకు భారత్‌ సాయం

కోట్లాది రూపాయల విలువైన టీబీ మందుల పంపిణీ

India provides medical assistance to North Korea

న్యూఢిల్లీ: ఉత్తరకొరియాలో ప్రస్తుతం ఔషధాల కొరత నెలకొంది. ఈనేపథ్యంలో ఆ దేశానికి ఔషధాలు పంపడానికి సాయం చేయాలంటూ భారత్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోరింది. ఆ వినతిపై భారత్ సానుకూలంగా స్పందించింది. కోట్లాది రూపాయల విలువైన టీబీ మందులను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేస్తూ ఉత్తరకొరియాలోని ప్రజల ఆరోగ్య పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వినతి మేరకు ఔషధాలను పంపుతామని చెప్పింది. కాగా, ఉత్తరకొరియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/