పాక్‌పై దాడి ఎన్నికల గిమ్మిక్కేనా!

sidhu
sidhu

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోఇ జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరాలపై భారత్‌ వైమానిక దళం (ఐఏఎఫ్‌) నిర్వహించిన మెరుపుదాడులపై కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో భారత్ నిర్వహించిన తీవ్రవాద వ్యతిరేక పోరులో వందలాది మంది తీవ్రవాదులను మట్టుబెట్టడం నిజమేనా? అని ఆయన ప్రశ్నించారు. విదేశీ శత్రువుతో పోరాటం పేరుతో మన గడ్డపై మోసం బారిన పడుతోంది. అని సిద్ధూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి… మీరు తీవ్రవాదులను ఏరివేస్తున్నారా? లేక చెట్లు పీకుతున్నారా? ఇది ఎన్నికల గిమ్మిక్కేనా? అని ప్రశ్నించారు.విదేశీ శత్రువుతో పోరాటం పేరుతో సొంతగడ్డ మోసపోతోంది. ఆర్మీని రాజకీయాలకు వాడుకోవడం మానండి. దేశం ఎంత గొప్పదో సైన్యం కూడా అంతే గొప్పది. అని సిద్దూ
ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.