మరోసారి అమెరికా అధ్యక్షున్ని అవుతాను

అమెరికా వస్తువులను భారత్‌ కొనుగోలు చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాం

donald trump
donald trump

న్యూఢిల్లీ: అమెరికా వస్తువులను భారత్‌ కొనుగోలు చేయడం తాము గౌరవంగా భావిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. భారత్‌లో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్న ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందానికి చర్చలు పురోగతిలో ఉన్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ఒప్పందానికి ముందు కొన్ని చట్టపరమైన అడ్డంకులు అధిగమించాల్సి ఉందన్నారు. వచ్చే ఆరేడు నెలల్లో ఒప్పందం రూపుదాల్చనుందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం తనకు ఉందని, మరోసారి తాను అమెరికా అధ్యక్షున్ని అవడం ఖాయమని ట్రంప్‌ ఆశాభవం వ్యక్తం చేశారు. తాను విజయం సాధిస్తే మార్కెట్లు భారీగా పుంజుకుంటాయన్నారు. సరైన వ్యక్తులను ఎన్నుకుంటేనే ఆర్థిక పురోభివృద్ధి సాధ్యమవుతుందని, లేదంటే ఆర్థిక పురోభివృద్ధి కుంటుపడుతుందని, నిరుద్యోగం పెరుగుతుందని ట్రంప్‌ తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/