ఇళయరాజా పాటలపై సర్వాధికారాలు ఆయనకే..

Ilayaraja
Ilayaraja, music director

చెన్నై: ఇళయరాజా స్వరపరచిన పాటలపై యాజమాన్య హక్కులు ఆయనకే చెందుతాయని హైకోర్టు తీర్పు వెల్లడిచేసింది. ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలను ఎవరూ ఉపయోగించరాదని న్యాయస్థానం తేల్చేసింది. అకి మ్యూజిక్‌ సంస్థ, ఎకో మ్యూజిక్‌ సంస్థ, గిరి ట్రేడర్స్‌ సంస్థలు ఇళయరాజా స్వరపరచిన పాటలకు తామే సర్వహక్కులు కలిగివున్నామని, అందువల్ల ఇళయరాజా తన పాటలను వినియోగించుకొరాదని చేసిన ప్రకటనపై స్టే విధించాలని కోరుతూ ఆ సంస్థల తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గత సంవత్సరం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఇళయరాజా పాటలు వాడుకొనేందుకు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత జరిగిన సమగ్రమైన విచారణ అనంతరం మంగళవారం తీర్పును వెలువరించింది. ఆ తీర్పులో ఇళయరాజా పాటలను ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ వినియోగించరాదంటూ గతంలో విధించిన స్టే ఉత్తర్వులను ఖరారు చేసింది. వ్యాపార దృక్పధంతో ఇళయరాజా పాటలను ఉపయోగించుకోవాలంటే ఆయన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, థియేటర్లలో ఆయన పాటలను ఉపయోగించుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/