వివాదాస్పద ట్వీట్‌, నిధి చౌదరికి స్థాన చలనం

Nidhi Choudhari
Nidhi Choudhari

ముంబై: మహాత్మాగాంధీపై వివాదాస్పద ట్వీట్‌ చేసిన మహారాష్ట్ర ఐఏఎస్‌ అధికారి నిధి చౌదరి స్థానచలనం కలిగింది. బృహన్‌ ముంబై కార్పొరేషన డిప్యూటి కమీషనర్‌ స్థానం నుంచి నీటి సరఫరా విభాగానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. అదేవిధంగా వ్యంగ్య ట్వీట్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం షోకాజ్‌ నోటీస్‌ జారీ చేసింది. మహాత్మాగాంధీ విగ్రహాలను ప్రపంచవ్యాప్తంగా తొలగించాలని, భారత కరెన్సీ నోట్లపై ఉన్న ఆయన బొమ్మను తీసేయాలంటూ ఐఏఎస్‌ అధికారిణి, బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ డిప్యూటి మున్సిపల్‌ కమీషనర్‌ నిధి చౌదరి గతనెల 17న ట్వీట్‌ చేశారు. గాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. ఈ ట్వీట్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని తొలగించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/