ప్రధాని పయనించే విమానాలకు ఐఎఎఫ్‌ పైలెట్లు

IAF pilots for Prime Minister’s flights

New Delhi: ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ఉన్నతాధికారులు ప్రయాణించే బి-777 విమానాలను ఇకపై భారత వైమానిక దళం పైలెట్లు నడిపించనున్నారు.

ఎయిర్‌ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్‌ ఇండియా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ విభాగం ఈ విమానాల నిర్వహణ బాధ్యతను చేపడుతుంది. ప్రస్తుతం ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు బి747 విమానాల్లో ప్రయాణిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై నెలనాటికి అమెరికాకు చెందిన బోయింగ్‌ కంపెనీనుంచి రెండు బి-777 విమానాలు రానున్నాయని ఒక అధికారి చెప్పారు.

ఈ విమానాలపై ఎయిర్‌ ఇండియా వన్‌ అనే గుర్తుంటుందని అన్నారు. బి-777 విమానాలను నడిపించడంలో ఇప్పటికే ఆరుగురు ఐఎఎఫ్‌ పైలెట్లకు శిక్షణ ఇచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. ఈ విమానాల్లో అత్యధునాతన మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు ఉంటాయని, వాటిని లార్జ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కౌంటర్‌మెజర్స్‌ (ఎల్‌ఎఐఆర్‌సిఎం), సెల్ఫ్‌ ప్రొటెక్షన్‌ సూట్స్‌ అంటారని ఆ అధికారి వివరించారు

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/