ఆదాయ పన్ను శ్లాబులో భారీ మార్పులు

రూ.2.50 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు

Nirmala Sitharaman
Nirmala Sitharaman

న్యూఢిలీ: ఆదాయపన్ను శ్లాబులో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ భారీగా మార్పులు చేశారు. ముఖ్యంగా మధ్య, ఎగువ తరగతి వర్గాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానానికి రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. ఆదాయ పన్ను అంశంలో ఇప్పటివరకు శ్లాబులు ఉండగా, ఇప్పుడు వాటిని 6 శ్లాబులుగా విస్తరించారు. రూ.0 నుంచి రూ.2.50 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను ఉండదని తెలిపారు. రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.5 లక్షల నుంచి రూ.7.50 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను, రూ.10 లక్షల నుంచి రూ.12.50 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను, రూ.12.50 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను, రూ.15 లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారిపై 30 శాతం పన్ను విధించారు. రూ.5 లక్షల లోపు ఆదాయంపై పన్నులో మార్పేమీ లేదు. గత పన్ను విధానాన్నే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/