దేశవ్యాప్తంగా ఘనంగా హోలీ సంబురాలు

Holi Celebrations
Holi Celebrations

న్యూఢిల్లీ: నేడు హోలీ సంబురాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముంబయి, పట్నా సహా ప్రధాన నగరాల్లో రంగులు చల్లుకుంటూ ప్రజలు వేడుకలు జరుపుకుంటన్నారు. హోలీకి ముందు నిర్వహించే కామదహనం కార్యక్రమాన్ని గుహవాటిలో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు పిడకలతో ఏర్పాటుచేసిన కాముడిని దహనం చేశారు. పట్నాలో జైషే ఉగ్రవాద సంస్థ నాయకుడు మసూద్‌ అజర్‌, ముంబయి పేలుళ్ల సూత్రధారి హఫీజ్‌ సయ్యద్‌ల నిలువెత్తు దిష్టి బొమ్మలను దహనం చేశారు. భారీగా పాల్గొన్న ప్రజలు ఖభారత్‌ మాతాకీ జై..గ అన్న నినాదాలతో హోరెత్తించారు. హోలీ సందర్భంగా మార్కెట్లన్నీ కొనుగోళ్లతో కిటకిటలాడగా.. రంగులు చల్లుకుంటూ.. నృత్యాలు చేస్తూ యువత సందడి చేసింది. అయోధ్యలో హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోకుల్‌లో నిర్వహించిన వేడుకల్లో యువత నృత్యాలతో అదరగొట్టింది. విదేశీయులు కూడా ఉత్సవాల్లో పాల్గొన్నారు. వారణాసిలో ముందస్తు హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/holi celebrationsindia