ఏప్రిల్‌ 7న హైకోర్టు విభజన

HIGH COURT
HIGH COURT

ఏప్రిల్‌ 7న హైకోర్టు విభజన

నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఎట్టకేలకు హైకోర్టు విభజన ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టును సైతం విభజించాలని తెలంగాణ ప్రాంత న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. అమరావతిలో హైకోర్టు భవనం నిర్మాణం పూర్త వుతే వెంటనే హైకోర్టు విభజన పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతిలో జస్టిస్‌ సిటీ నిర్మాణం తుది దశకు చేరుకోవటంతో వచ్చే వేసవి సెలవుల్లో అంటే ఏప్రిల్‌ 7వ తేదీన ఏపి హైకోర్టు అప్పాయింటెడ్‌ డేగా రాష్ట్రపతి నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఒక్కటిగా ఉన్న ఏపి హైకోర్టు ఇక ఏపి-తెలంగాణ హైకోర్టు విడిపోనుంది. రాష్ట్ర విభజన నాటి నుంచి హైకోర్టు విభజనపై తెలంగాణ ప్రాంత న్యాయవాదులు ఆందోళన నిర్వహించారు. ఆదే విధంగా కోర్టుతో పాటు న్యాయమూర్తుల విభజన చేయాలని డిమాండ్‌ చేశారు. కొద్ది రోజుల క్రితం న్యాయమూర్తుల విభజనతో పాటుగా సిబ్బంది విభజన పూర్త యింది. ఏపిలో హైకోర్టు నిర్మాణం పూర్తయితే, హైకోర్టును ఏపిలో ఏర్పాటు చేయటానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అదేసమయంలో ఏపి ప్రభుత్వం సైతం అమరావతిలో నేలపాడు గ్రామంలో హైకోర్టు నిర్మాణం చేపట్టామని ఈ ఏడాది చివరికి నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది.