దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం

అయోధ్య రామజన్మభూమిపై నేడు తుది తీర్పు

High alert
High alert

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో అయోధ్య వివాదంపై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. దీంతో దేశ వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌, యూపీ, జమ్ము కశ్మీర్‌, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలువులు ప్రకటించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో సైతం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. గోవా, యూపీ, జమ్ము కశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల్లో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 144 సెక్షన్‌ విధించారు. భోపాల్‌, బెంగళూర్‌లలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. బెంగళూర్‌లో కూడా 144 సెక్షన్‌ విధించారు. జమ్ము కశ్మీర్‌లో పరీక్షలను వాయిదా వేశారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ తదితర సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలు మోహరించాయి. హైదరాబాద్‌లో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పలు రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/