హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

పలు రోడ్లు జలమయం

Heavy rains in UP
Heavy rains

హైదరాబాద్‌‌: హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఖైర‌తాబాద్‌, సోమాజిగూడ‌, బేగంపేట‌, అల్వాల్‌, బోయిన్‌ప‌ల్లి, తార్నాక‌, కుషాయిగూడ‌, ఈసీఐఎల్‌, నాచారం, ఎల్‌బీన‌గ‌ర్‌, వ‌న‌స్థ‌లిపురం ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అలాగే, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, క‌ర్మ‌న్‌ఘాట్‌, చార్మినార్‌, మ‌ల‌క్‌పేట‌, మెహిదీప‌ట్నం, గ‌చ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, ల‌క్డీకాపూల్, కోఠి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు తెలంగాణలోని ప‌లు జిల్లాల్లోనూ భారీ వ‌ర్షం పడుతోంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/