గాంధీ-నెహ్రూ ఆస్తులపై విచారణకు ఆదేశం

ఉత్తర్వులు జారీ చేసిన హర్యానా ప్రధాన కార్యదర్శి

sonia gandhi
sonia gandhi

చండీగఢ్‌: హరియాణలో గాంధీ-నెహ్రు కుటుంబ సభ్యుల ఆస్తులపై సమగ్ర విచారణకు బిజిపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేష్మీ ఆనంద్ అరోరా ఈ ఉదయం నగర పరిపాలనా సంస్థల శాఖను కోరారు.

రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తో పాటు, రాజీవ్ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ లపై విచారణకు కేంద్రం ఇప్పటికే ఓ కమిటీని సైతం నియమించింది. బిజెపి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, ఈ విషయంలో తాము నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామని ఎన్డీయే నేతలు అంటున్నారు. హర్యానాలో కాంగ్రెస్ కారు చౌకగా అసోసియేటెడ్ జర్నల్స్ కు కట్టబెట్టిన ప్లాట్ ను ఇప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. 23 ఏళ్ల నాటి ధరల ఆధారంగా పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నది ఈడీ ఆరోపణ.

కాగా, రాష్ట్రంలోని సోనియా, రాహుల్ గాంధీల ఆస్తులపై గతంలో ప్రారంభమైన విచారణ కొనసాగుతుందని, గురుగ్రామ్ లో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు కేటాయించిన ఫ్లాట్ పై ఆరా తీస్తున్నామని అధికారులు వెల్లడించారు. గాంధీలు నిర్వహించే ట్రస్ట్ లకు వచ్చిన విదేశీ విరాళాలపై కేంద్రం ఇప్పటికే విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/