నా భర్త 20 రోజుల నుంచి కనిపించడం లేదు

హార్దిక్ పటేల్ భార్య కింజాల్ పటేల్ ఆందోళన

kinjal-patel-hardik-patel
kinjal-patel-hardik-patel

గుజరాత్‌: గుజరాత్ పటిదార్ ఉద్యమ నాయకుడైన హార్దిక్ పటేల్ గత 20 రోజుల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య కింజాల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో ద్వారా తెలిపారు. గుజరాత్ పాలకులు తన భర్తను టార్గెట్ చేశారని వీడియోలో ఆమె ఆరోపించారు. పటిదార్ ఉద్యమంలో పాల్గొన్న మరో ఇద్దరు వ్యక్తులు బీజేపీలో చేరడంతో వారిపై కేసులు ఎత్తేశారని… తన భర్తను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై తన భర్త స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. గుజరాత్ లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తన భర్తను జైలుకు పంపేందుకు యత్నిస్తున్నారని కింజాల్ పటేల్ చెప్పారు. తనను అరెస్ట్ చేసేందుకు అహ్మదాబాద్ పోలీసులు తన ఇంటికి వచ్చారని… ఆ సమయంలో తాను ఇంట్లో లేనని హార్దిక్ పటేల్ కొన్ని రోజుల క్రితం ఓ ట్వీట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/