నేటి నుంచి హెచ్‌1బీ ప్రీమియం ప్రాసెస్‌

H1b Visa Premum Processing
US

సోమవారం నుంచి హెచ్‌1బీ ప్రీమియం ప్రాసెస్‌ దరఖాస్తులను ప్రాసెస్‌ చేస్తున్నట్లు అమెరికా పౌరసత్వం వలసవాద సేవల (యుఎస్‌సీఐఎస్‌) విభాగం శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించింది. కాగా యుఎస్‌సీఐఎస్‌ ప్రీమియం ప్రాసెస్‌లను రెండు దశల్లో ప్రాసెస్‌ చేస్తుంది. మొదటి దఫా ప్రాసెస్‌ ఏప్రిల్‌1 నుంచి ప్రారంభించింది. ఈ దరఖాస్తులు 2020 ఆర్థిక సంవత్సరానికి (అక్టోబర్‌ 1,2019 నుంచి ప్రారంభమవుతుంది) ఈ వీసాల ప్రాసెస్‌ల విషయానిక వస్తే వీసా స్టాటస్‌ (హోదా)లో మార్పులు… ప్రస్తుతం ఎఫ్‌-1 వీసాలు కలిగిన వారు.. వీరితో పాటు ఆప్షనల్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రాం (ఓపీటీ). అలాగే కంపెనీ యాజమాన్యాలు హెచ్‌1బీ వీసాను స్పాన్సర్‌ చేసిన వాటిని ప్రాసెస్‌ చేస్త్తుంది.
కాగా రెండవ దశ ప్రాసెసింగ్‌ విషయానికి వస్తే.. జూన్‌ 10 నుంచి ప్రారంభమవుతుంది. అయితే యాజ మాన్యాలు స్పాన్సర్‌ చేసిన హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల విషయానికి వస్తే హోదా మాత్రం మారదు. అయితే ఈ వీసాలను అప్‌గ్రేడ్‌ చేసి ప్రీమియం ప్రాసెసింగ్‌ కింద 1,410 డాలర్లు చెల్లించి మార్చుకోవచ్చు.. దీనికి 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.