భారత డాక్యుమెంటరీకి ఆస్కార్‌

guneet monga
guneet monga, producer


లాస్‌ఏంజెల్స్‌: అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 91వ ఆస్కార్‌ వేడుకలో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా నిర్మించిన పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌ అనే డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్‌ లభించింది. భారత్‌లో పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమం సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 25 నిమిషాల నిడివి గల డాక్యుమోంటరీని ఉత్తర్‌ప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి రేకా జెహ్‌తాబ్చి దర్శకత్వం వహించారు. ఆస్కార్‌ను అందుకున్న ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇప్పటివరకు ఎన్నో భారతీయ చిత్రాలు ఆస్కార్‌కు నామినేట్‌ ఐనప్పట్టికి అవార్డుల విషయానికి వచ్చేసరికి చాలా సార్లు నిరాశనే ఎదురవుతుందని ఆస్కార్‌ స్టేజ్‌ పై ఆమె అన్నారు.