ఇరాన్‌లోని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక

ఇరాక్ కు భారతీయులెవరూ వెళ్లవద్దు

Raveesh Kumar
Raveesh Kumar

న్యూఢిల్లీ: ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజా పరిస్థితులు యుద్ధానికి దారి తీసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసం కాని పక్షంలో భారతీయులెవరూ ఇరాక్ కు వెళ్లరాదని హెచ్చరించింది. తమ తదుపరి ప్రకటన వెలువడేంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇరాక్ లో ఉన్న భారతీయులకు కూడా సూచనలు చేసింది. ఇరాక్ లో నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇరాక్ లో ప్రయాణాలను ఆపేయాలని, ఎక్కడకూ ప్రయాణించవద్దని, ఉన్న చోటే ఉండిపోవాలని సూచింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని మన ఎంబసీ, ఇర్బిల్ లోని మన కాన్సులేట్ యథాతథంగా పని చేస్తాయని రవీశ్ కుమార్ తెలిపారు. ఇరాక్ లో నివసిస్తున్న భారతీయులకు అవసరమైన అన్ని సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంటాయని చెప్పారు. ఇరాక్ లో ఎంతో మంది భారతీయులు నిర్మాణ రంగంలో పని చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/