అటల్‌ పింఛన్‌ యోజనకు వయోపరిమితి పెంపు

Nirmala Sitaraman
Nirmala Sitaraman

న్యూఢిల్లీ: అటల్‌పెన్షన్‌యోజనలో చేరే చందాదారులకోసం వయోపరిమితిని సడలించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పిఎఫ్‌ఆర్‌డిఎ ఇందుకు సంబంధించి ఒక ప్రతిపాదనను కూడా అందచేసిందని, పింఛను వయసును పెంచాలని కోరిందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ప్రస్తుతం 18 నుంచి 40 ఏళ్లవరకూ ఉన్న ఖాతాదారులకు ఈ పింఛన్‌ వయసును నిర్ణయించారు. కనీస నెలవారీ పింఛన్‌ వెయ్యినుంచి ఐదువేలవరకూ ఉంటుందని అంచనా. 60ఏళ్లు వచ్చేసరికి ఈ పింఛన్‌ అందుతుందని వెల్లడిచేస్తోంది. పింఛన్‌ కంట్రిబ్యూషన్‌ కూడా నెలసరి 42 రూపాయలుగా ఉంది. అదనంగా భార్యలకు నెలవారిగా పింఛన్‌ చందాదారు మరణిస్తే నామినీ కార్పస్‌ మొత్తం సుమారు 8.5 లక్షలు లభిస్తుంది. పింఛనుదారు మరణించినా లేక భార్య మరణించినా ఈ మొత్తం నామినీకి అందుతుంది. అటల్‌పింఛన్‌యోజన కింద 60 ఏళ్లనాటికి చందాదారు కనీస హామీతోకూడిన పింఛన్‌ వెయ్యినుంచి ఐదువేలవరకూ ఉంటుందని అంచనా. అదే పింఛన్‌ భర్త చనిపోతే భార్యకుసైతం అందిస్తారు. ఈ మొత్తంలో భర్త చనిపోతే ఆమొత్తం భార్య లేదా నామినీకిసైతం అందచేస్తారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/