గోదావరి పరవళ్లు

నిండు కుండలా తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులు

Godavari water level
Godavari water level

Bhadrachalam: రెండురోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం పరివాహక ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి..

దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 33 అడుగుల దాటి ప్రవహిస్తోంది.

ఎగువన ఉన్న తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో.. గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/